AAP : తిరుపతిలో బీజేపీ, ఆప్ కార్యకర్తల మధ్య బాహాబాహీ
తిరుపతి (Tirupati) లో బీజేపీ,(BJP) ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఢీల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా (Sipodia) అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ స్టేట్ ఛీప్ సోము వీర్రాజు (Veeraju) కాన్వాయిని ఆప్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. సిసోడియా అరెస్టును నిరసిస్తూ వీర్రాజు కాన్వయ్ వద్ద నినాదాలు చేశారు.
తిరుపతి (Tirupati) లో బీజేపీ,(BJP) ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఢీల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా (Sipodia) అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ స్టేట్ ఛీప్ సోము వీర్రాజు (Veeraju) కాన్వాయిని ఆప్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. సిసోడియా అరెస్టును నిరసిస్తూ వీర్రాజు కాన్వయ్ వద్ద నినాదాలు చేశారు. బీజేపీ నేతలు ఎదురు తిరిగారు. సోము వీర్రాజు కాన్వాయ్ ను అడ్డుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై బీజేపీ నేతలు దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ (CBI) విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది.
లిక్కర్ (Liquor) పాలసీ, ముడుపులు, టెండర్ల( tenders) వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను అరెస్టు చేశారు. విచారణకు సహకరించకపోవడం, దినేష్ అరోరాతోపాటు పలువురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం, సీబీఐ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా ఏ1గా ఉన్నారు. గత ఏడాది ఆగష్టులోనే ఆయనపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా మద్యం వ్యాపారుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP ) చెందిన మీడియా ఇంచార్జి విజయ్ నాయర్ ద్వారా రూ.100 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ముడుపులు మనీష్ సహా పలువురు ఆప్ నేతలకు చేరినట్లు, వాటిని పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సీబీఐ (CBI) ఆరోపిస్తోంది. గతంలో ఈ కేసులో సీబీఐ పలువురిని అరెస్టు చేసింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, బుచ్చి బాబును ఇప్పటికే అరెస్టు చేయగా, తాజాగా మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. ఆరు నెలలుగా సీబీఐ, ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్నాయి.