love harassment to rakshita:ప్రేమ వేధింపుల వల్లే రక్షిత ఆత్మహత్య
love harassment to rakshita:మెడికో ప్రీతి మృతి వీడకముందే ఇంజినీరింగ్ విద్యార్థిని రక్షిత సూసైడ్ కలకలం రేపింది. తొలుత రక్షిత కూడా ర్యాగింగ్ వల్లే చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఆమె ర్యాగింగ్ వల్ల చనిపోలేదని.. రాహుల్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందని తెలిసింది.
love harassment to rakshita:మెడికో ప్రీతి మృతి వీడకముందే ఇంజినీరింగ్ విద్యార్థిని రక్షిత సూసైడ్ కలకలం రేపింది. తొలుత రక్షిత (rakshita) కూడా ర్యాగింగ్ వల్లే చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఆమె ర్యాగింగ్ (ragging) వల్ల చనిపోలేదని తెలిసింది. ప్రేమ పేరుతో వేధించడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందని తెలిసింది. ప్రేమ పేరుతో మోసం చేయడం వల్లే రక్షిత చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. కాలేజీలో ర్యాంగింగ్ వల్ల కాదని స్పష్టం చేసింది.
రక్షిత (rakshita) సూసైడ్ గురించి నర్సంపేటలో (narsampeta) గల జయముఖి ఇంజినీరింగ్ కాలేజీ (jayamukhi engineering college) స్పందించింది. రక్షిత తమ కాలేజీ ఈసీఈ (ece) గ్రూపులో చేరిందని తెలిపింది. రెండేళ్లు చదివిందని వివరించింది. బ్యాక్ లాగ్స్ ఎక్కువగా ఉండటంతో మూడో ఏడాది డిటెంట్ అయ్యిందని పేర్కొంది. ఆరు నెలలుగా కాలేజీకి రావడం లేదని చెప్పింది. కాలేజీకి రాని వారిని ర్యాగింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించింది. సోషల్ మీడియాలో (social media) తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది.
చదవండి:Preethi face caste abuse:కులం పేరుతో దూషించారు.. రాత్రి 11 గంటల వరకు పనిచేయించేవారు
భూపాలపల్లిలో (bhupalapally) పదో తరగతి చదువుకునే రోజుల్లో రాహుల్‌తో రక్షితకు (rakshita) పరిచయం ఉందని తెలిసింది. అప్పుడే ప్రేమ (love) పేరుతో వేధించాడట. ఫోటోలను (photo) సోషల్ మీడియాలో పెడతానని చెప్పగా.. రక్షిత గతంలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని తెలిసింది. అప్పుడు పోలీసులు రాహుల్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారట.. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదట. పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో రక్షితకు టార్చర్ పెరిగిందని తెలిసింది. అది తట్టుకోలేక రక్షిత (rakshita) సూసైడ్ (suicide) చేసుకుందని సమాచారం.
రాహుల్ వేధింపుల గురించి రక్షిత పేరంట్స్కు కూడా తెలుసు. అందుకే కాలేజీ హాస్టల్ కాదని.. వరంగల్ రామన్న పేటలో గల ఆమె బాబాయ్ ఇంట్లో ఉంచి రక్షితను పేరంట్స్ చదివిస్తున్నారు. అయినప్పటికీ హరాస్ మెంట్ తగ్గలేదు. దీంతో రక్షిత బలవన్మరణానికి పాల్పడింది.