chandrababu:గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద ఇటీవల అల్లరిమూకలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రోజు గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu) పరిశీలించారు. ధ్వంసమైన టీడీపీ ఆఫీసును (tdp office) పరిశీలించారు. ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు (chandrababu) పేర్కొన్నారు.
chandrababu:గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద ఇటీవల అల్లరిమూకలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రోజు గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu) పరిశీలించారు. ధ్వంసమైన టీడీపీ ఆఫీసును (tdp office) పరిశీలించారు. ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు (chandrababu) పేర్కొన్నారు. పెట్రోల్ (petrol), రాళ్లతో వచ్చి దాడులు చేశారని.. ఐదు కార్లు, 2 బైక్ లు ధ్వంసం చేశారని వివరించారు. తమ పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని చెప్పారు. రౌడీలు, సైకోలు స్వైర విహారం చేశారని మండిపడ్డారు. ఏ రౌడీ అయినా కాలగర్భంలో కలిసిపోక తప్పదని చంద్రబాబు (chandrababu) హెచ్చరించారు. పోలీసుల చేష్టలు అర్థం కావడం లేదన్నారు.
రెచ్చగొట్టి తప్పుడు పనులు చేస్తే జైలుకు పోవాల్సిందేనని చంద్రబాబు (chandrababu) స్పష్టంచేశారు. బెదిరిస్తే పారిపోతామం అనుకుంటున్నారేమో.. కానీ తాము పోరాడుతూనే ఉంటామన్నారు. ఎన్ని వేల మంది వస్తారో రండి అని సవాల్ విసిరారు. ఇకనైనా మారాలని బాధతో చంద్రబాబు నాయుడు (chandrababu) అడిగారు. కొంతమంది బుద్ధి లేని పోలీసుల (police) వల్లే సమస్య వచ్చిందని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినవారిపై కేసులు పెడతారా? అని అడిగారు. ఎయిర్ పోర్టు పక్కనే ఉంది.. ఇలాంటిచోట్ల దాడులు చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఫస్ట్ టైమ్ వైసీపీ గూండాలు వచ్చినప్పుడే పోలీసులు అడ్డుకోవాలి కదా? అన్నారు. అలా చేస్తే తమపై, పోలీసులపై దాడులు జరిగేవి కావన్నారు.
చదవండి:sajjala on viveka murder case:సజ్జల సంచలనం.. వివేకా కేసు తీరుపై సందేహాలు
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే అనునిత్యం పనిచేశానని చంద్రబాబు (chandrababu) గుర్తుచేశారు. చివరికీ తమ ఆస్తులపై దాడి చేసి.. మళ్లీ మాపై కేసు పెడతారా? అని అడిగారు. ఆ దద్దమ్మలను తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని కోరారు. సీఎం జగన్ (jagan) పోలీసులతో తప్పుడు పనులు చేయిస్తున్నారని విరుచుకుపడ్డారు. జగన్ (jagan) నమ్ముకున్న వాళ్లంతా జైలుకు పోతారని తేల్చిచెప్పారు. 5 కోట్ల ప్రజల కోసం ప్రాణాలొడ్డి పోరాడే కార్యకర్తలు ఉన్నారని వివరిచారు. తాము ప్రజల ఆస్తులకు అండగా ఉంటామని వివరించారు. ఎందరో మహనీయులు పుట్టిన కృష్ణా జిల్లాకు చెడ్డపేరు తెచ్చారని చంద్రబాబు (chandrababu) విరుచుకుపడ్డారు.
చదవండి:magunta srinivasula reddy:రాఘవ ఏ తప్పు చేయలేదు: శ్రీనివాసుల రెడ్డి
వైసీపీ నేతలు బరితెగించారని చంద్రబాబు (chandrababu) మండిపడ్డారు. గన్నవరం వెళ్లకుండా వెయ్యిమంది పోలీసులతో తనను అడ్డుకోవాలని చూస్తారా? అని అడిగారు. గన్నవరం ఏమైనా పాకిస్తాన్లో ఉందా? అని అడిగారు. రాష్ట్రంలో అవినీతి, సైకో పాలన పోవాలని చంద్రబాబు అన్నారు. బెదిరిస్తే భయపడేది లేదన్నారు. ప్రజలంతా సమైక్యంగా రావాలని కోరారు. లేదంటే గన్నవరం మరో పులివెందుల అవుతుందని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని స్పష్టంచేశారు.