GNTR: విశాఖపట్నంలో ఈనెల 17 నుంచి 19 వరకు జరిగిన టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ 2025లో మంగళగిరికి చెందిన 11 ఏళ్ల దేవతి భువన్ సత్తా చాటాడు. 6వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పోటీల్లో మొదటి బహుమతి సాధించాడు. ఈ విజయంతో భువన్ ప్రస్తుతం అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నాడు. అతన్ని బుధవారం పలువురు అభినందించారు.