W.G: బంగాళాఖాతంలో మైంత తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఈ సందర్భంగా నరసాపురం-సఖినేటిపల్లి రేవులో పంటు, పడవలపై రాకపోకలు ఆదివారం పూర్తిగా నిలిపివేశారు. పంటి రేవులో రెవిన్యూ, పోలీసు, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా పంటి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రం ఇబ్బందులు పడ్డారు.