అన్నమయ్య: మైనారిటీల సంక్షేమమే NDA కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాజంపేట TDP ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. ఇవాళ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణపల్లె ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం పెంపొంది ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.