ASR: దేవవరం, గొడిచెర్ల గ్రామాల్లో అక్రమంగా మద్యం బెల్టుషాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మంగళవారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై సాహిబా అంజుమ్ తెలిపారు. దేవవరంలో 20, గొడిచెర్లలో 9 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు. అక్రమ మద్యం అమ్మకాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.