కృష్ణా: గుడివాడ VKR & VNB కాలేజ్ వద్ద ఎస్సై శ్రీనివాస్ రోడ్డు ప్రమాదాల గురించి విద్యార్థులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలు,రోడ్డు ప్రమాదాలు నివారించడంలో హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం అవసరం గురించి వివరించారు. వేగవంతమైన డ్రైవింగ్, ప్రమాదకరమైన ఓవర్‌టేకింగ్ వంటి చర్యల వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు.