KDP: ఇడుపులపాయలో వెలసిన వన దుర్గ భవాని అమ్మవారు ఆదివారం విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు, వివిధ రకాల అభిషేకాలను నిర్వహించి నిమ్మకాయలు, పూలమాలలతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.