VSP: విశాఖలోని శాంతిగిరి కాలనీ కొండ ప్రాంతంలో గత వారం అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన రెండు కుటుంబాలకు వైసీపీ అండగా నిలిచింది. వార్డు అధ్యక్షుడు రేవళ్ల సత్యనారాయణ సేకరించిన రూ. 15 వేల రూపాయలను పార్టీ పశ్చిమ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆదివారం బాధితులకు అందజేశారు.