AKP: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. కసింకోట మండలం నర్సింగబిల్లి జడ్పీ హైస్కూల్ పరిధిలో హెచ్ఎం సుజాత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారన్నారు.