GNTR: కల్తీ మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ప్రత్తిపాడులో ఇవాళ వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. పాతమల్లాయపాలెం సెంటర్ నుంచి ప్రత్తిపాడు ఎక్సైజ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీగా వెళ్లిన నాయకులు, కార్యకర్తలు, కల్తీ మద్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఎక్సైజ్ సీఐకు వినతి పత్రం అందజేశారు.