కడప జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 158 పిటీషన్లు అందాయి. అదనపు ఎస్పీ కె. ప్రకాష్ బాబు జిల్లా పోలీసు అధికారులను ఆదేశిస్తూ, చట్ట పరిధిలో ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా తెలుసుకొని, పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.