AKP: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటవిడుపుగా విజయవాడలో శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ‘లలిత ప్రియా కమలం.. విరిసింది’ అంటూ పాడిన సినీ గేయం ఆకట్టుకుంది. పాట పాడిన ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభినందించారు.