NLR: దగదర్తి మండలం చౌట పుత్తెడు వెళ్లే రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడి అధ్వానంగా తయారయ్యిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోడ్డుపై ప్రయాణం నరక ప్రాయంగా ఉందంటున్నారు. బైకులు, ఆటోలపై ప్రయాణం చేయాలంటే వాహనాలు పాడవుతున్నాయనీ ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.