E.G: కొవ్వూరు టౌన్‌లోని పీఎంఎంఎంఎం (PMMMM) హైస్కూల్లో మెగా డీఎస్సీ-2025 ద్వారా ఉద్యోగాలు సాధించి సోమవారం విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన నూతన టీచర్లు, విద్యార్థులతో మాట్లాడి విద్యా పురోగతి గురించి ఆరా తీశారు. నూతన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి, సెల్ఫీ దిగారు.