కృష్ణా: కాటూరు గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం రూ.50 లక్షణ వ్యయంతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి బోడే ప్రసాద్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, పీహెచ్సీ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని చెప్పారు.