అనంతపురం: రాయదుర్గం పట్టణంలో నేడు నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి మీడియాకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీరాపురం కరెంట్ సబ్ స్టేషన్ వద్ద లైన్ ఫ్లాట్ కావడంవల్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది అన్నారు. దీంతో నీటి పంపిణీకి తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రజలు నేడు నీటిని పొదుపుగా వాడుకుని తమకు సహకరించాలని కోరారు.