కృష్ణా: తాడిగడపలోని పోరంబోకు భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వైసీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి ఈరోజు పరిశీలించారు. రికార్డు ఆఫ్ రైట్స్ ప్రకారం మొత్తం 2.08 సెంట్ల భూమి పోరంబోకు భూమిగా ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా నమోదు అయిందని తెలిపారు. ఈ భూమిపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు.