VZM: పోక్సో కేసులో గంట్యాడ మండలం కొత్తవెలగాడకు చెందిన చంద్రరావుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించినట్లు SP దామోదర్ సోమవారం తెలిపారు. 2024 మే 21న 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన నిందితుడిపై మహిళా పోలీసు స్టేషన్లో కేసు నమోదై, దర్యాప్తులో అభియోగాలు రుజువయ్యాయని చెప్పారు. కోర్టులో PP ఖజానారావు వాదనలు సమర్థవంతంగా వినిపించారన్నారు.