కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భీమవరం దాతలు వుద్ధరాజు రాఘవరాజు, సూర్యనారాయణ రాజు రూ.17 లక్షల వ్యయంతో స్వర్ణ శఠగోపాన్ని చేయించారు. 108 గ్రాముల బంగారంతో తయారు చేసిన దీనిని శుక్రవారం కొత్తపేట MLA బండారు సత్యానందరావు సమక్షంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందించారు. సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి సేవలకు వినియోగించారు.