PPM: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో లభ్యమయ్యే అటవీ, వ్యవసాయ ఉత్పత్తులు యొక్క దిగుబడి మార్కెటింగ్ పై దృష్టిసారించాలని ఐటీడీఏ పీవో ఆసుతోష్ శ్రీవాత్సవ అన్నారు. శనివారం ఐటీడీఏ కార్యాలయంలో జీసీసీ అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ ఉత్పత్తులకు ఎంత మేర మద్దతు ధర ప్రకటిస్తే గిరిజనులు ఎంత లబ్ధి పొందుతారో ఈ విషయంపై పలు సూచనలు చేశారు.