కడప: టీడీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య తనయుడు అకాల మరణం చెందిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నివాళులర్పించారు. కడపలోని కో-ఆపరేటివ్ కాలనీలోని ఎమ్మెల్సీ నివాసంలో విష్ణు స్వరూప్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రయ్యను, కుటుంబసభ్యులను అయన పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.