NDL: డోన్ పట్టణంలోని నంద్యాల రైల్వే ట్రాక్‌పై గురువారం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. గూడ్స్ రైలు కింద పడి మృతి చెందినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు జలదుర్గం గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ వలిగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.