అన్నమయ్య: జిల్లాలో గ్రామస్థాయి వరకు అందుబాటులో ఉన్న యూరియా పై సమాచారాన్ని రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అమరావతిలోని సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఎరువుల అందుబాటుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.