SKLM: వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం రైతు బజార్ వద్ద డ్వాక్రా మహిళల సంఘ ఆధ్వర్యంలో సేంద్రియ ఉత్పత్తుల మొబైల్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం పట్ల రైతులు మక్కువ చూపాలని కోరారు. భవిష్యత్తులో సేంద్రీయ వ్యవసాయమే కొనసాగుతుందన్నారు.