YS Jagan: ఏపీలో పాలిటిక్స్ రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. ఏపీలో జేపీ నడ్డా, అమిత్ షా సభల తర్వాత రాజకీయం మరింత వేడెక్కింది. సీఎం జగన్ (YS Jagan) ఈ రోజు స్పందించారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నాలుగో విడత జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ, టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగనన్నకు బీజేపీ అండగా నిలవకపోవచ్చు.. జగన్ వీళ్లని నమ్ముకోలేదని చెప్పారు. నిన్న విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్స్ చేసిన వెంటనే జగన్ మాట్లాడారు. కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలే తన సైన్యం అని జగన్ స్పష్టంచేశారు. ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డ జగన్కు (YS Jagan) అండగా నిలవాలని కోరారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. మంచి చేయాలని ఏ రోజు ఆయనకు ఉండదన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఒక్క మంచి పథకం తీసుకురాలేదని చెప్పారు. ఏ ఒక వర్గాన్ని వదలకుండా వాగ్దానం చేస్తారు.. తర్వాత మోసం చేస్తారని మండిపడ్డారు. గత ప్రభుత్వానికి.. తమ ప్రభుత్వానికి గల తేడా గమనించాలని జగన్ (YS Jagan) కోరారు. చంద్రబాబు బతుకే మోసం, అబద్ధం, కుట్ర, వెన్నుపోటులు అని ధ్వజమెత్తారు. ఆ మూడు వార్తా సంస్థలు, దత్తపుత్రుడు కలిసి అండగా నిలుస్తున్నారని జగన్ (YS Jagan) పేర్కొన్నారు. పక్క రాష్ట్రం నుంచి మేనిఫెస్టో తీసుకొచ్చారని ఆరోపించారు. ఇన్నాళ్లూ రాయలసీమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఎందుకు గుర్తుకురాలేదని జగన్ నిలదీశారు. ఆ సమయంలో ఏం చేశావు.. గాడిదలు కాశావా.. చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.