NLR: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఉర్దూ డీఐ షేక్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. బుధవారం వింజమూరులోని పాతూరు ఉర్దూ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను, బోధనా పరికరాలను పరిశీలించి పాఠశాలను చక్కగా నిర్వహిస్తున్న HM ఖాదర్ బాషాను అభినందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.