CTR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పుంగనూరు తాలూకా అధ్యక్షురాలిగా బీ. మధుబాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సంఘ సమావేశం జరిగింది. అధ్యక్షురాలిగా పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి హెడ్ నర్స్ మధుబాల, కార్యదర్శిగా అక్బర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడతామని, సంఘం తరఫున ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.