NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయికి సింగరాయకొండ చెందిన దంపూరి పుష్వాంత్ కుమార్ 234 గ్రాముల వెండి పట్టీలు బహుకరించారు. సోమవారం వాటిని ఆలయ నిర్వాహకులకు కుటుంబ సమేతంగా వచ్చి అందజేశారు. దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.