సత్యసాయి: సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో మౌలిక సదుపాయాల మెరుగుదల పనులు వేగవంతమయ్యాయి. నవంబరులో జరగనున్న ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునీకరించే పనులు జోరుగా సాగుతున్నాయి.