NTR: రామచంద్రాపురం గ్రామ పరిధిలోని మామిళ్ల చెరువు కట్ట మార్గం ప్రస్తుతం రైతులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఈ చెరువు కట్ట దారిని నిత్యం సుమారు 500 ఎకరాల వ్యవసాయ భూములకు వెళ్లే రైతులు ప్రధాన రాకపోకల మార్గంగా ఉపయోగిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన డస్ట్ తరలింపు లారీలు గత రెండు రోజులుగా చెరువు కట్ట మార్గం మధ్యలో నిలిపడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.