NLR: పంటలకు యూరియా అధికంగా వాడటం మంచిది కాదని వింజమూరు ఏడీఏ శేషగిరిరావు సూచించారు. కలిగిరి మండలం అనంతపురంలో యూరియా వాడకంపై అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఏడీఏ మాట్లాడుతూ.. రైతులు యూరియాను ఇష్టానుసారం కాకుండా వ్యవసాయాధికారుల సూచనలు మేరకు వాడుకోవాలని,లేకపోతే భూసారం తగ్గుతుందని తెలిపారు. రైతులు సహజ ఎరువులపై దృష్టి పెట్టాలని భూమి నాణ్యతను కాపాడలని వివరించారు.