ప్రకాశం: డీఈఎస్ఈడీ మొదటి సంవత్సరం సప్లమెంటరీ(2018-20) పరీక్ష ఫలితాలపై ఈనెల 7 లోపు రీకౌంటింగ్ కోసం ఫీజు చెల్లించాలని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. డమ్మీ మార్కుల జాబితాలు ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున సీఎఫ్ఎంఎస్ ద్వారా చలానా తీసి డమ్మీ మార్కుల జాబితాను జతచేసి సెల్ఫ్ అడ్రసు కవర్తో నేరుగా అందజేయాలని ఆయన కోరారు.