CTR: వడమాలపేట మండలంలోని లక్ష్మమ్మ కండ్రిగ ఎస్టీ కాలనీలో 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీలో విద్యుత్ లేకపోవడంతో రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దృష్టికి తీసుకేళ్లారు. కాలనీలో స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. విద్యుత్ సదుపాయం కల్పించడంతో కాలనీవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.