W.G: శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా బైకులను, వాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.