PPM: జిల్లాలో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఎకనామిక్స్ పరీక్షకు 352 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విభాగంలో 1597 మందికి గానూ 161 మంది, ఒకేషనల్ విభాగంలో 1585 మందికి గానూ 191 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, నిబంధనల ప్రకారం పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.