ASR: డుంబ్రిగూడ మండలం మొర్రిగూడ గ్రామంలో గురువారం జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ – బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ ఆఫీసర్ సీదరి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు, బాలకార్మికత్వం వంటివి అరికట్టేందుకు గ్రామస్థులలో చైతన్యంగా ఉండాలన్నారు.