GNTR: పొన్నూరు పురపాలక సంఘ పరిధిలోని పాఠశాలల్లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆధార్ నమోదు, సవరణల కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.