అన్నమయ్య: మందుల షాపులపై విజిలెన్స్, ఔషధ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణంలో విస్తృతంగా ఆకస్మిక దాడులు చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.కేశవరెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చీటీ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మకాలు జరిపిన వెంటనే వాటి వివరాలను హెచ్ వన్ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.