KRNL: ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో ఓడీ, ఏడీసీగా పనిచేస్తున్న ఎంఎల్ రెడ్డి (55) గుండెపోటుతో కన్నుమూశారు. విధుల్లో ఉండగా అస్వస్థతకు గురైన ఆయనను సహచరులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డిపో మేనేజర్ మద్దిలేటి నాయుడు, యూనియన్ నేత ముస్తాక్ అహ్మద్ నివాళులర్పించారు. ఈ ఘటనతో డిపోలో విషాద ఛాయలు అలముకున్నాయి.