ASR: పాడేరు మండలంలోని కుజ్జెలి పంచాయతీ గొర్రెలగొంది, కొత్తఊరు గ్రామాల్లో ఐటీడీఏ కాఫీ విభాగం ఆధ్వర్యంలో మండల కాఫీ ఫీల్డ్ కన్సల్టెంట్ విజయ్ కాంత్, లైజన్ వర్కర్ కృష్ణ కాఫీ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రైతులతో కలిసి కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీ బెర్రీ బోరర్ తెగులు సోకినప్పుడు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు గురించి అవగాహన కల్పించారు.