KKD: వ్యక్తిగత కారణాలతో యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కాకినాడలో చోటుచేసుకుంది. కాకినాడ రేచర్ల పేటకు చెందిన వాకపల్లి దివ్యకుమారి (21) పదో తరగతి తరువాత ఇంటి వద్దే ఉంటోంది. వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన దివ్య కుమారి ఇంటి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.