NLR: ఆత్మకూరులోని ఈద్గా మైదాన్‌లో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా నమాజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది చెత్త తొలగించి షామియానాలు ఏర్పాటు చేశారు. నమాజ్‌కు వచ్చే వారికి తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సుమారు 5,000 మంది ప్రార్థనలు చేసేందుకు వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.