»Atchannaidu Demands To Specilal Flight To Manipur Telugu Students
Manipurలో అంతా జరుగుతుంటే సీఎం జగన్ కు సోయి లేదు.. అచ్చెన్నాయుడు ఆగ్రహం
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడడంపై లేదా?’ అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని గుర్తు చేశారు. తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అక్కడ పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో అక్కడి వెళ్లిన ఇతర రాష్ట్రాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అలా వెళ్లిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. తమ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ (Govt of Telangana) ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే.. ఏపీ ప్రభుత్వం (Govt of AP) మాత్రం ఇంకా మేలుకోలేదు. దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchenaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ మణిపూర్ లో ఏపీ విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సీఎం జగన్ (YS Jagan) మొద్దునిద్ర పోతున్నారని విమర్శించారు.
మణిపూర్ వ్యవహారంపై అచ్చెన్నాయుడు (Atchannaidu) విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మణిపూర్ లో ఉన్న తెలుగు విద్యార్థులను (Telugu Students) ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. ప్రతిపక్షాలపై (Oppositions) అక్రమ కేసులు నమోదు చేయడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడడంపై లేదా?’ అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని గుర్తు చేశారు. తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు. రంగులు వేయడం కోసం.. మీ ప్రచారం కోసం రూ.కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు గానీ ఆపదలో చిక్కుకున్న విద్యార్థులను ఆదుకోరా? అని అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రత్యేక విమానాల్లో రాష్ట్రంలో తిరిగే సీఎం జగన్ మణిపూర్ లో విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఒక విమానం (Special Flight) ఏర్పాటుచేయకపోవడం సిగ్గు చేటు అని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడి విద్యార్థులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
కాగా, మణిపూర్ లో చిక్కుకున్న విద్యార్థులను (Students) తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్కడ ఉన్న తమ ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు ప్రత్యేక విమానం పంపింది. అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలను రప్పించేందుకు ప్రత్యేక సెల్ (Special Cell) ఏర్పాటు చేసింది. మణిపూర్ లో సుమారు 250 మందికి పైగా తెలంగాణ వారు ఉన్నారని తెలిసింది. ఇంఫాల్ లోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ విద్యార్థులు చదువుకుంటారు. అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Santhi Kumari) మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదింపులు చేస్తున్నారు. విద్యార్థులు సురక్షితంగా వచ్చేలా చర్యలు చేపట్టారు. దీనిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. కాగా అక్కడి వారి కోసం టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ప్రకటించారు.