»Marriage Cancelled Drunk Groom Put Vermilion In His Mouth Bride Refused To Marry In Up
Drunk Groom తప్ప తాగి బొట్టు పెట్టలేకపోయిన వరుడు.. వధువు ఏం చేసిందంటే..?
వరుడిపై తిట్ల దండకం మొదలుపెట్టారు. పెద్దలు సద్దుమణిగేలా చొరవ తీసుకున్నారు. అయితే వధువు మనస్తాపానికి గురైంది. వెంటనే అతడిని పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది.
పెళ్లిలో (Marriage) సంప్రదాయంగా.. పద్ధతిగా ఉండాల్సిన వరుడు తప్ప తాగి వచ్చాడు. ఆ తాగిన మైకంలో (Drunked) సక్రమంగా జరగాల్సిన ప్రక్రియను చెడగొట్టాడు. పెళ్లి తంతులో భాగంగా వధువు నుదిటిపై సింధూరం పెట్టాల్సిన యువకుడు విఫలమయ్యాడు. బొట్టు పెట్టాల్సింది పోయి ఆమె ముఖంపై చల్లాడు. ఇలాంటి తాగుబోతును చేసుకోలేనని ఆ యువతి స్పష్టం చేసింది. దీంతో ఆనందంగా జరుగాల్సిన పెళ్లి పెంట పెంట అయ్యింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మీర్జాపూర్ జిల్లా అహిరౌరా (Ahirora) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
చందౌరి జిల్లా (Chandauli District) మానిక్ పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడికి శుక్రవారం వివాహం జరుగాల్సి ఉంది. వివాహం కోసం వధువు గ్రామం చాకర్ ఘట్ట గ్రామానికి ఊరేగింపుగా బయల్దేరారు. అనంతరం పూజా కార్యక్రమాలు చేశారు. అయితే అప్పటికే తాగిన మత్తులో ఉన్న వరుడు వింతగా చేస్తున్నాడు. ఈ సమయంలో వధువు నుదుటిపై బొట్టు (Sindoor) పెట్టాల్సి ఉంది. సింధూరం పెట్టకుండా ఆమె ముఖంపై చల్లాడు. దీనిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ వరుడు కోపంలో వధువుపై చేయి చేసుకున్నాడు. దీంతో కల్యాణ మండపంలో గందరగోళం మొదలైంది.
వధువు తరఫు కుటుంబసభ్యులు (Family), బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుడిపై తిట్ల దండకం మొదలుపెట్టారు. పెద్దలు సద్దుమణిగేలా చొరవ తీసుకున్నారు. అయితే వధువు మనస్తాపానికి గురైంది. వెంటనే అతడిని పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. పెద్దల సమక్షంలో చర్చలు జరిపినా వధువు పెళ్లికి అంగీకరించలేదు. పెళ్లికి చేసిన ఖర్చు తిరిగి ఇవ్వాలని వధువు కుటుంబసభ్యులు అడగడంతో వరుడి కుటుంబం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో చిన్న సంఘటనతో పెళ్లి పెటాకులైంది.