»Ambati Rambabu Talks About Ap Assembly Elections 2024
Ambati Rambabu: 2024 ఎన్నికలు ఎలా ఉంటాయో… దేవుడి దయ
2024 అసెంబ్లీ ఎన్నికలు (andhra pradesh assembly elections 2024 ) ఎలా ఉంటాయనేది దేవుడి దయ (Sri Venkateswara Swamy) అని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) అన్నారు. అయితే వచ్చే ఎన్నికలు మాకు తెల్లగా, ప్రతిపక్షాలకు నల్లగా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికలు (andhra pradesh assembly elections 2024 ) ఎలా ఉంటాయనేది దేవుడి దయ (Sri Venkateswara Swamy) అని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) అన్నారు. అయితే వచ్చే ఎన్నికలు మాకు తెల్లగా, ప్రతిపక్షాలకు నల్లగా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (Tirumala) వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను కుటుంబ సభ్యులతో శ్రీనివాసుడి దర్శనానికి వచ్చానని, ఆనందంగా ఉందన్నారు. గతంలో ప్రాతఃకాలంలో బ్రేక్ దర్శనాలు (tirumala break darshan) జరిగేవని, ఉదయం పది గంటలకు బ్రేక్ దర్శనంలో ఉండటం ఇదే మొదటిసారి అన్నారు. బ్రేక్ దర్శనాల (tirumala break darshan) మార్పు గురించి తెలుసుకొని, ఆనందించినట్లు చెప్పారు. ఉదయం బ్రేక్ దర్శనం (tirumala break darshan) ఇస్తే వేలాది మంది సామాన్య భక్తులు (Tirumala Devotees) నిరీక్షించవలసి వస్తోందన్నారు. సామాన్య భక్తుల ఇబ్బందులను గుర్తించిన పాలక మండలి బ్రేక్ దర్శనం సమయంలో మార్పు చేయడం బాగుందన్నారు. ప్రాతఃకాలంలో రాత్రంతా వేచి ఉండే సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. దర్శనాల విధివిధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. సామాన్య భక్తులే ముఖ్యమని భావించి, ఈ మార్పు చేశారని, వేంకటేశ్వరుడి ఆశీస్సులతో చాలా సంస్కరణలు తెచ్చారన్నారు.
దర్శనాలకు సంబంధించి విమర్శలు సరికాదని, అన్నారాంబాబు టీటీడీని ఎందుకు విమర్శించారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆయన అలా మాట్లాడటం వంద శాతం తప్పు అన్నారు. ఒకరికో లేదా ఇద్దరికో దర్శనంలో ఇబ్బందులు వస్తే రాజకీయం చేయవద్దని హితవు పలికారు. కొండ పైన రాజకీయాలు చేయడం తన ఉద్దేశ్యం కాదని, అందుకే రాజకీయాలు మాట్లాడటం లేదన్నారు. అదే సమయంలో కొండ పైన గంజాయి అక్రమ రవాణా దారుణం అన్నారు. టీడీపీ వ్యక్తులు లేదా మరొకరు చేసినా వెయ్యి కళ్లతో పాలక మండలి ఉందని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న వారు దర్శన టోకెన్లను దళారులకు అమ్ముకున్న విషయం అందరికీ తెలుసునని, వైసీపీ అధికారంలోకి వచ్చాక దళారులను ఏరి పారేశామన్నారు.