»Alert To Tirumala Devotees 36 Hours Time For Srivari Sarvadarshan
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్..శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం
తిరుపతి(Tirupati)లోని గోవిందరాజ స్వామి ఆలయంలో మే 21 నుంచి 25వ తేదీ వరకు బంగారు తాపడం విమాన గోపురం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మే 26వ తేది నుంచి జూన్ 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Annual Brahmotsavams) నిర్వహించనున్నట్లు తెలిపింది.
తిరుమల(Tirumala)లోని శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. భక్తులతో తిరుమలలోని మాఢ వీధులు కిటకిటలాడుతుంటాయి. వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ భారీగా పెరిగిందని, వైకుంఠంలోని కంపార్ట్మెంట్లు(Compartments) అన్నీ నిండిపోయి భక్తులు గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నట్లు టీటీడీ తెలిపింది. ఈ తరుణంలో టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం 36 గంటలు పడుతోందని టీటీడీ వెల్లడించింది.
తిరుపతి(Tirupati)లోని గోవిందరాజ స్వామి ఆలయంలో మే 21 నుంచి 25వ తేదీ వరకు బంగారు తాపడం విమాన గోపురం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మే 26వ తేది నుంచి జూన్ 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Annual Brahmotsavams) నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటి కార్యక్రమాల ఏర్పాట్లపై జేఈవో వీరబ్రహ్మం అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. మే 21 నుంచి 24వ తేదీ వరకు వైదిక కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. మహా సంప్రోక్షణ కారణంగా మే 20 నుంచి 25వ తేదీ వరకు ఆలయంలో ఊంజల్ సేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.