గోదావరి పై పాపికొండల యాత్ర (Papikondala Yatra) ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన నేపథ్యంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాపికొండల విహారయాత్ర (Viharayatra)ను అధికారులు రద్దు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు తోడు ఈదురు గాలులు వీస్తుండడంతో పాపికొండల యాత్రను నేడు, రేపు రద్దు చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ యాత్రకు అనుమతించనున్నట్టు పోశమ్మగుడి (Poshammagudi)కంట్రోల్ రూమ్ మేనేజర్ రజిత్ వెల్లడించారు.ఉపరితల ద్రోణి కారణంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం (Rajamahendravaram) మధ్య లాంచీ ప్రయాణం గురించే. జర్నీ టైమ్ లో వచ్చే పాపి కొండలు, గంభీరంగా సాగిపోయే గోదావరి అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. గతంలో గోదావరి(Godavari)లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బోట్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరుత్సాహం చెందుతున్నారు