ELR: మొంథా తుఫాన్ వలన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ఉంగుటూరు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రకటనల హోర్డింగ్స్ బోర్టులను, ప్లెక్సీలను సోమవారం డీఎల్పీవో, మండల ప్రత్యేక అధికారి అమ్మాజీ దగ్గర ఉండి తొలగించారు. ఈ కార్యక్రమాన్ని మండలంలో మొదటగా ఉంగుటూరు నుంచి శ్రీకారం చుట్టామన్నారు. సహాయకులుగా సర్పంచ్ బండారు సింధు మధుబాబు, కార్యదర్శి బొడ్డు రవి పాల్గొన్నారు.